![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-301 లో.. మురారి దగ్గరికి కృష్ణ వస్తుంది. కృష్ణని చూసిన భవాని ఇంట్లోకి రావొద్దని చెప్తుంది. నాకు ఎవరితోనూ వాదించాలని లేదు రేవతి.. నువ్వు చెప్పు తనని ఇక్కడ నుండి వెళ్ళిపోమని అని రేవతికి చెప్తుంది భవాని. రేవతి ఇబ్బందిగానే తనకి గతం గుర్తుకు చేసే ప్రయత్నం చెయ్యవద్దని డాక్టర్ చెప్పింది అని కృష్ణకి చెప్తుంది.
ఆ తర్వాత నేను గతం గుర్తుకు చెయ్యను. నేను ఏసీపీ సర్ కి ట్రీట్ మెంట్ ఇస్తానని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత భవాని వచ్చి ఒక ప్లాన్ సక్సెస్ కాలేదని ఏకంగా ఇక్కడే తీస్ట వెయ్యడానికి వచ్చావా అని కృష్ణతో భవాని అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు. నేను ఏసీపీ సర్ భార్యని అనగానే.. మా అబ్బాయికి గతం గుర్తుకు రాగానే డైవర్స్ ఇప్పిస్తానని కృష్ణకి భవాని చెప్తుంది. ఆ మాటలకీ ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భవానిని అత్తయ్య అని కృష్ణ పిలుస్తుంటే.. అలా పిలువకు చిరాకు వేస్తుందని భవాని అనగానే.. అత్తయ్య అని పిలువను మేడమ్ అని అంటానని కృష్ణ చెప్తుంది. అయిన కృష్ణని ఇంట్లోకి రావడానికి భవాని అసలు ఒప్పుకొదు. కృష్ణ ఇంటి ముందే నిలబడి ఉంటుంది. ముకుంద డోర్ వేస్తుంది. మరొక వైపు మురారి దగ్గరికి ముకుంద వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది.
మరొక వైపు పాపం కృష్ణని చూస్తే బాధేస్తుందని రేవతితో మధు అంటాడు. అయితే తనతో పాటు నువ్వు కూడా వెళ్ళకపోయావని రేవతి అంటుంది. మరొక వైపు మురారికి గతం తాలుకా జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. పిచ్చిపట్టినట్లు చేస్తుంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి మురారికి ఇంజక్షన్ ఇస్తుంది. నా అవసరం ఏసీపీ సర్ కీ ఎంత అయిన ఉంది. నేను ఇక్కడే ఉంటానని భవానిని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. కృష్ణ గెస్ట్ హౌస్ లో ఉండడానికి భవాని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కృష్ణని గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్తుంది ముకుంద. నువ్వు బాధపడుతున్నవా అని కృష్ణతో ముకుంద అనగానే.. నువ్వు భయపడుతున్నావా అని ముకుందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |